252
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్‌ఐసీయూ వార్డులో 10 మంది మరణించారు. ఒకే రోజు వ్యవధిలో ఇలా జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆక్సిజన్ అందకపోవడం వల్లే మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.