బిగ్ స్టార్స్ రజనీకాంత్-కమల్‌హాసన్ 21 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. అదేంటి.. ఆ స్టార్ హీరోలిద్దరూ కలుస్తూనే ఉంటారు కదా? ఇప్పుడు కలవడమేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయా? అవును.. అనేక వేదికలపై వారిద్దరూ ఎప్పుడూ కలుసుకుంటూనే ఉంటారు. కానీ, షూటింగ్స్‌లో కలుసుకోవడానికి వారికి ఇన్నాళ్లు పట్టింది. 21 ఏళ్ల కిందట రజనీకాంత్ ‘బాబా’, కమల్‌హాసన్ ‘పంచతంత్రం’ సినిమాలు ఒకే చోట చిత్రీకరణ చేసుకోగా.. అప్పుడు ఇద్దరూ సెట్లో కలిసి ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి ఓ సెట్‌లో వాళ్లిద్దరు కలుసుకున్నారు. కమల్ ప్రస్తుతం ‘భారతీయుడు2’లో నటిస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన 170వ చిత్రంలో నటిస్తున్నారు. ఆ రెండు సినిమాల చిత్రీకరణలు చెన్నైలో ఒకే చోట జరుగుతుండటంతో రజనీ, కమల్ ఇద్దరూ ఇలా కలుసుకున్నారు. కమల్ నేరుగా రజినీ సినిమా సెట్‌కు వెళ్ళారు. ఇద్దరూ గత స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు.
216
previous post