టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు తన భార్య పల్లవి వర్మతో కలిసి నిఖిల్ వెళ్లాడు. అక్కడ పల్లవి బేబీ బంప్తో కనిపించారు. ఆ ఫొటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై నిఖిల్ ఇప్పటివరకు ఏ ప్రకటన చేయలేదు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లవి నిఖిల్ కి పరిచయం అయ్యారు. రెండేళ్లకు పైగా వీరి మధ్య ప్రేమ ప్రయాణం సాగినట్లు టాక్. ఆ తర్వాత కరోనా టైమ్లో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అతికొద్దిమంది ఆత్మీయుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఇక నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్నారు. తన కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న స్వయంభూపై భారీ అంచనాలు ఉన్నాయి. సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.
281
previous post