727
పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’లో మరో సీనియర్ నటుడు వెంకట్ భాగమయ్యాడు. తాను ‘ఓజీ’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కొంతమేర చిత్రీకరణ కూడా అయిందన్నాడు. ప్రస్తుతానికి అంతకుమించి ఏం చెప్పలేనని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందన్నాడు. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘శివరామరాజు’ తదితర చిత్రాల్లో వెంకట్ అలరించాడు. ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో తమిళ నటులు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి తదితరులు కూడా నటిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఈ సినిమాతోపాటు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు.