ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకుంటానని శివరామ్ నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న శివరాంను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు శివరాం కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో శివరామ్ ను పోలీసులు కావాలనే ఇరికించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
377
previous post