suicide mounika
Home » AP News: ప్రియుడిని మరువలేక ప్రియురాలు సూసైడ్‌

AP News: ప్రియుడిని మరువలేక ప్రియురాలు సూసైడ్‌

by admin
0 comment

ప్రేమించిన యువకుడు మరణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేవీనగర్‌లో మౌనిక(22) నివాసం ఉంటుంది. తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్‌ కాలేజీలో నరింగ్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. పదేళ్ల క్రితమే ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ త్రిమూర్తుల దగ్గర ఉంటుంది. ఆమెకు ఓ అక్క, చెల్లి కూడా ఉన్నారు. వారిద్దరికీ వివాహమైంది.

అయితే రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన చిన్నాతో మౌనిక ప్రేమలో ఉంది. రెండు నెలల క్రితం చిన్నా సూసైడ్‌ చేసుకున్నాడు. గంజాయికి బానిసైన అతడు తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పుంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో నుంచి మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది. అతడికి సంబంధించిన వస్తువులను చూస్తూ ఇంట్లోనే ఉంటుంది. కాలేజీకు వెళ్లడం కూడా మానేసింది. ఈ క్రమంలో సోమవారం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links