252
వడగళ్ల వాన దెబ్బకు విమానం తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కల్లో ఏకంగా రంధ్రాలు పడ్డాయి. ఇటలీలోని మిలన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయల్దేరిన విమానానికి ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రోమ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 185 నంబర్ గల ఈ విమానంలో 215 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, బయల్దేరిన సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉంది. కానీ ప్రయాణం ఆరంభించిన 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో కూడిన వానలో చిక్కుకుంది. దీంతో విమానంలోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. విమానాన్ని నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికరంగా మారడంతో రోమ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.