బియ్యం కోసం అమెరికాలో ఎన్నారైల తిప్పలు

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరుగుతాయోనన్న భయంతో చాలా మంది ఎన్నారైలు ముందుగానే సూపర్‌ మార్కెట్లకు పరుగులు పెట్టారు. దీంతో ఇండియన్‌ స్టోర్స్‌ వద్ద బియ్యం కోసం ఎన్నారైలు ఎగబడ్డారు. అమెరికాతో పాటు కెనడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

కాగా, బియ్యం ఎగుమతులపై నిషేధం నేపథ్యంలో కొన్ని స్టోర్లు ధరలను భారీగా పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం బ్యాగ్‌ ధరను ఏకంగా 50 డాలర్లకు పెంచి విక్రయిస్తున్నట్లు పలువురు ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం