jadeja-hardik
Home » అప్పట్లో జడేజాపై నిషేధం- హార్దిక్‌పై వేటు తప్పదా?

అప్పట్లో జడేజాపై నిషేధం- హార్దిక్‌పై వేటు తప్పదా?

by admin
0 comment

క్రికెట్‌ ప్రపంచంలో గత రెండు రోజులుగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గురించే చర్చ సాగుతోంది. హార్దిక్‌ తిరిగి ముంబయి ఇండియన్స్‌ గూటికి చేరనున్నాడని, అతని కోసం ముంబయి.. గుజరాత్ టైటాన్స్‌కు రూ.15 కోట్లు చెల్లించనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే హార్దిక్‌ ముంబయి జట్టుతో చర్చలు జరిపాడని, అందుకే ట్రేడింగ్‌లో భాగంగా ఇది జరుగుతుందని మరో వార్త వైరల్‌గా మారింది. అది నిజమైతే హార్దిక్‌ పాండ్య నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో రవీంద్ర జడేజా ఈ రీతిలోనే ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. 2008, 2009 సీజన్లలో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన జడేజా.. 2010 సీజన్‌కు ముందు రూల్స్‌కు వ్యతిరేకంగా మరో ఫ్రాంచైజీతో బేరసారాలకు దిగాడు. అది తీవ్ర వివాదాస్పదమైంది. జడ్డూపై బీసీసీఐ నిషేధం విధించింది. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ను సంప్రదించకుండా హార్దిక్‌ అలా చేసి ఉంటే బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి! 2015లో ముంబయి ఇండియన్స్‌ తరఫున హార్దిక్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత రెండు సీజన్‌ల్లో గుజరాత్‌ టైటాన్స్ తరఫున ఆడిన అతడు కెప్టెన్‌గా సూపర్‌సక్సెస్‌ అయ్యాడు. రెండు సార్లు గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన హార్దిక్‌ 2022 సీజన్‌లో జట్టును విజేతగా నిలిపాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links