406
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తాము ఇచ్చిన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వనమా వెంకటేశ్వరరావు సమయం కోరడంతో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన లంచ్‌మోషన్ పిటిషన్‌ను బుధవారం దాఖలు చేశారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచి ఎన్నికల అఫిడవిట్ సమర్పించినందుకు శిక్షగా ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది. దీంతోపాటు పిటిషనర్ జలగం వెంకట్రావు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. జలగం వెంకట్రావు 2018 డిసెంబరు 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది.