రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది.

వాయవ్య బంగాళఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. కాగా, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సిద్దిపేట జనగాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..