296
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వాయవ్య బంగాళఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. కాగా, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సిద్దిపేట జనగాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.