హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. భారీ వర్షాలు

నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి జోన్‌ల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అంతేగాక గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని పేర్కొంది. కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం కూడా కావచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..