352
నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కూకట్పల్లి జోన్కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అంతేగాక గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని పేర్కొంది. కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం కూడా కావచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి.