VIDEO: ఆఖరి మజిలీకి అన్నీ కష్టాలే

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వేచరేణి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకొంది. వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ అంతిమయాత్రను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే.. వేచరేణి గ్రామంలో నివసిస్తున్న బసవరాజ్‌ బాలయ్య అనారోగ్యంతో మృతిచెందారు. అయితే వాగు అవతల వైకుంఠధామం ఉంది. దీంతో దహన సంస్కారాల కోసం మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వాగులో ఇబ్బందులు పడుతూ వెళ్లారు. వాగుపై వంతెన లేకపోవడంతో తరచుగా ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..