348
ప్చ్.. క్లీన్‌స్వీప్ సాధించాలనుకున్న రోహిత్‌సేనకు నిరాశ ఎదురైంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా ముగిసింది. 1-0తో సిరీస్‌ను సాధించింది. అయితే ఆఖరి టెస్టులో టీమిండియా ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ.. వర్షం పడటంతో సోమవారం ఆటే జరగలేదు. దీంతో విండీస్‌తో 4 పాయింట్లను పంచుకొని టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో భారత్ (16 పాయింట్లు, 66.67 %) రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పాకిస్థాన్ (12 పాయింట్లు, 100 %) ఉంది.
కాగా, వెస్టిండీస్ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వన్డే సిరీస్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది.