భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రీషెడ్యూల్‌?

టీమిండియా, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఫార్మాట్‌ ఏదైనా విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. వీక్షకుల పరంగా ఎప్పుడూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంటుంది. అయితే వన్డే ప్రపంచకప్‌ సమరంలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.

వన్డే ప్రపంచకప్‌ అక్టోబర్‌లో మొదలుకానుంది. అదే నెల15వ తేదీన అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో టీమిండియాకు మ్యాచ్‌ ఉంది. ఇప్పటికే ఆ మ్యాచ్‌కు సంబంధించిన తేదీల్లో అక్కడి పరిసరాల్లోని హోటళ్లు ముందే బుకింగ్‌ కూడా జరిగాయి.

అయితే 15వ తేదీ నుంచే గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రత సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఒక్క రోజు ముందు మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలనే యోచనలోనూ ఉన్నారని తెలుస్తోంది. అక్టోబర్‌ 5 నుంచి మొదలుకానున్న వన్డే ప్రపంచకప్‌ నవంబర్‌ 19వరకు జరగనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం