House
Home » వాన నీరు ఇంటి నుంచి ఏ దిక్కుగా వెళ్తే మంచిది?

వాన నీరు ఇంటి నుంచి ఏ దిక్కుగా వెళ్తే మంచిది?

by admin
0 comment

వానాకాలం వచ్చేసింది. విరామం లేకుండా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అయితే వాన నీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే దిక్కుని బట్టి కూడా మనపై ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇల్లు చిన్నదా, పెద్దదా అని తేడా లేకుండా వాస్తు ఉంటే అన్నీ కలిసివస్తాయని మనలో చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇలా వాస్తు శాస్త్రంలో వర్షపు నీరు ఇంట్లో ఏ వైపు నుంచి బయటకు వెళ్లాలనేది కూడా ఓ కీలక విషయం.

స్థలం వాస్తు ప్రకారం ఉండి, ఇల్లు వాస్తు మేరకు కట్టినా సరిపోదు. వాస్తు ఫలితాలు పొందాలంటే వాడుకునే విధానం కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే సంతృప్తినిచ్చే అనుభవాలు పొందే అవకాశం ఉంటుందని వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో పడిన వర్షపు నీటితోపాటు రోజువారీ కాలకృత్యాలకు వాడిన నీరు ఇంటికి ఈశాన్యం నుంచే బయటకు వెళ్ళడానికి ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నారు.

అయితే ఆచరణలో చూసినప్పుడు అన్ని దిక్కుల ఇళ్ల వారికి ఈ నియమం సాంకేతికంగా అనుకూలించదు. అయినా ఆందోళన అక్కర్లేదని, తూర్పు ఉత్తర దిశలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ పడమర, దక్షిణ దిక్కులకూ ఇతరత్రా మేలు చేస్తుందనేది వాస్తు పండితులు విశ్లేషిస్తున్నారు. వాయవ్యం, ఆగ్నేయం మూలల నుంచి కూడా తగినంత ఫలితాలు పొందవచ్చని అంటున్నారు.

వర్షపు నీరు బయటకు వెళ్లే విషయంలో ఈశాన్యం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అదే కాకుండా కొన్ని దిక్కుల నుంచి వెళ్లిన కూడా మంచిదేనని వాస్తు పండితుల మాట. ఆగ్నేయాన్ని రెండుగా విభజిస్తే.. తూర్పు ఆగ్నేయం ప్రతికూల ఫలితాలను ఇస్తే, దక్షిణ ఆగ్నేయం మంచి ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా వాయవ్య దిక్కులో.. ఉత్తర వాయవ్యం వాస్తురీత్యా ప్రతికూల ఫలితాలను ఇస్తే పడమర వాయవ్యం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఇక ఇంటికి నాలుగో మూల నైరుతి పరంగా చూసినప్పుడు దక్షిణ నైరుతి ఇటు పడమర నైరుతి రెండూ చెడు ఫలితాలు ఇస్తాయని వాస్తుశాస్త్ర సిద్ధాంతులు చెబుతున్నారు. అయితే ఇంటికి నాలుగు దిక్కుల్లో ఖాళీ స్థలం ఉంటే అన్నివిధాలా శాస్త్రానుగుణంగా ఏర్పాట్లకు వీలుగా వుంటుంది. కానీ తక్కువ విస్తీర్ణంలో కట్టే ఇళ్లకు ఇంటికి నాలుగు వైపులా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. ఇల్లు ఏ దిక్కున ఉన్నా తప్పనిసరిగా ఒక మూల డ్రైనేజీ ఏర్పాట్లకు వాస్తు శాస్త్రం అనుకూలంగా ఉంటుందనేది గుర్తించాలి.

అలాగే భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ఇంకుడు గుంతలు శాస్త్రీయంగా ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు అందులోకి విడిగా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈశాన్యం వైపు బోరు, బావికి దగ్గరగా ఇంకుడు గుంతల ఏర్పాటు ఫలితాలు ఇస్తుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links