229
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్’, ‘మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి’ అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు.
కాగా, మణిపుర్ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ.. చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ ఆందోళనల మధ్యే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ 12 గంటల వరకు, రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతులు తెలిపారు.