Home » Urvasi Rauthela – ఈమె గ్లామర్ సీక్రెట్స్ ఇవే

Urvasi Rauthela – ఈమె గ్లామర్ సీక్రెట్స్ ఇవే

by admin
0 comment

హీరోయిన్లు ఏం తింటారు, పొద్దున్నే లేచి ఏం చేస్తారు, ఎలాంటి కాస్మొటిక్స్ వాడతారనే విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇప్పటితరం హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు ఆ విశేషాల్ని బయటపెడుతూనే ఉంటారు. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది హాట్ బ్యూటీ ఊర్వశి రౌథేలా.

వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది ఈ బ్యూటీ. తాజాగా వచ్చిన ఏజెంట్ సినిమాలో కూడా ఓ ఐటెంసాంగ్ చేసింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో ఊర్వశి పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలకు మంచి క్రేజ్ వచ్చింది.

ఈ క్రమంలో ఊర్వశి లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలనే తపన చాలామందికి కలిగింది. తాజాగా ఊర్వశి తన డైట్ సీక్రెట్ ను బయటపెట్టింది. యోగా, జిమ్ తో తన రొటీన్ లైఫ్ ను స్టార్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. ప్రతి రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంది. జిమ్ మాత్రం వారానికి 3 రోజులు మాత్రమే చేస్తుంది.

దీంతో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కు ఇంట్లో డాన్స్ చేస్తుంది. ఇది కూడా మంచి ఎక్సర్ సైజ్ అంటోంది ఈ బ్యూటీ. ఇక ఆహారపు అలవాట్ల విషయానికొస్తే, ఉదయం ఎగ్ వైట్ ఆమ్లెట్, ఓట్ మీల్ తో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తుంది.

మధ్యాహ్నం హోమ్లీ ఫుడ్ తీసుకుంటుంది. డిన్నర్ లో తాజా పండ్లు, సలాడ్స్ తీసుకుంటుంది. ఇక సౌందర్యానికి సంబంధించి కెమికల్స్ ఎక్కువగా ఉండే కాస్మొటిక్స్ వాడనంటోంది ఊర్వశి. ప్రకృతిసిద్ధమైన ఆర్గానిక్ ఉత్పత్తులనే మొహానికి ఫేస్ ప్యాక్ లా వాడుతుందంట. ఇదే ఊర్వశి గ్లామర్ సీక్రెట్.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links