malli pelli
Home » Malli Pelli Movie – మళ్లీ పెళ్లి.. మరోసారి

Malli Pelli Movie – మళ్లీ పెళ్లి.. మరోసారి

by admin
0 comment

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ చిత్రం “మళ్ళీ పెళ్లి”. సీనియర్ నటుడు నరేష్ అలాగే నటి పవిత్ర లోకేష్ జంటగా దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్ అయింది. చాన్నాళ్ల కిందటే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. విడుదలకు ముందు వివాదాస్పదమైన ఈ సినిమాను ఈ జూన్ 23 నుంచి మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు.

ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో కూడా అదే రోజు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు నాన్-ఎక్స్ క్లూజివ్ కింద రైట్స్ అమ్మారు నిర్మాత కమ్ హీరో నరేష్.


సో.. ఈ రెండు ఓటీటీల్లో, ఈ శుక్రవారం నుంచి మళ్లీ పెళ్లి సినిమా, మరోసారి అలరించబోతోందన్నమాట. సీనియర్ నటుడు నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలు, అతడి సహజీవనం, మూడో పెళ్లిలో తలెత్తిన ఇబ్బందులు.. లాంటి అంశాలన్నింటినీ ఈ సినిమాలో ఫిక్షనల్ గా చర్చించారు. తన నిజజీవిత పాత్రను నరేష్ పోషించగా.. పవిత్ర కూడా తన నిజజీవిత పాత్రలో నటించారు. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో వనిత విజయ్ కుమార్ నటించారు.

నరేష్ నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని మరింత ఫిక్షనలైజ్ చేయడం, వనిత విజయ్ కుమార్ పాత్రను విలన్ గా చూపించడం, పవిత్ర లోకేష్ ఫ్లాష్ బ్యాక్ మరింత షాకింగ్ గా ఉండడం ఈ సినిమాలో హాలెట్స్. సురేష్ బొబ్బిలి, అరుణ్ దేవ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links