Home » BRO Movie – బ్రో మూవీ అప్ డేట్

BRO Movie – బ్రో మూవీ అప్ డేట్

by admin
0 comment

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామఅల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్ పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల టీజర్ విడుదల చేయగా విపరీతంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవన్ లుక్ ఫ్యాన్స్ కి మరింత ఎక్కువ కిక్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు. ఓ పాట కోసం ఆస్ట్రియా వెళ్లింది యూనిట్. అక్కడ ఓ పాట చిత్రీకరించారు. ఈ సాంగ్ షూట్ తో టోటల్ మూవీ షూటింగ్ పూర్తయింది.

ఈ మేరకు ఆయన ఫోటోలను కూడా షేర్ చేశాడు. ఆస్ట్రియాలో షూటింగ్ చేయడం చాలా అద్భుతంగా ఉందని, చిత్ర బృందానికి కేవలం ఒక్క ధ్యాంక్స్ చెప్పి సరిపెట్టలేనని ఆయన అన్నాడు. ఈ సినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కి రీమేక్ గా తెరకెక్కుతోంది బ్రో. మూవీలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు. జీవితాన్ని కోల్పోయిన సాయిధరమ్ తేజ్ కు, లైఫ్ లో సెకెండ్ ఛాన్స్ ఇచ్చే భగవంతుడిగా పవన్ కల్యాణ్ కనిపిస్తాడు. అలా రెండోసారి లైఫ్ ఛాన్స్ అందుకున్న సాయితేజ్, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఎలా సెట్ చేసుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links