Home » Movie Review – బేబి

Movie Review – బేబి

by admin
0 comment

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష తదితరులు..
నిర్మాత: ఎస్కేఎన్
ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్
రచన & దర్శకత్వం: సాయి రాజేష్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: విప్లవ్
రన్ టైమ్: 2 గంటల 51 నిమిషాలు
సెన్సార్: U/A
రేటింగ్: 2.75/5

ఈ వీకెండ్ అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన మూవీ మాత్రం బేబి. సాయిరాజేష్ డైరక్షన్ లో ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ప్రచారం సాగింది. సాంగ్స్, ట్రయిలర్ హిట్టవ్వడంతో అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంచనాల్ని అందుకుందా? News360 Telugu ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) బస్తీ కుర్రాడు. తన ఎదురింట్లో ఉండే వైష్ణవి తనను ప్రేమిస్తుందని తెలుసుకొని ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఇద్దరు ఒకరికొకరు ప్రేమలో ఉన్న సందర్భంలో వైష్ణవి కాలేజీ లో చేరుతుంది. పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారతాడు. కాలేజీ లో చేరిన కొద్ది రోజులకే వైష్ణవి కి విరాజ్ తో (విరాజ్ అశ్విన్) తో పరిచయం ఏర్పడుతుంది. వైష్ణవి ఆల్రెడీ ప్రేమలో ఉందని తెలియని విరాజ్ ఆమె ముందు తన ప్రేమ ప్రపోజల్ పెడతాడు. మరి ఆనంద్ తో ప్రేమలో ఉన్న వైష్ణవి, విరాజ్ ప్రేమను ఒప్పుకుందా ? ప్రేమిస్తున్న వైష్ణవినే ప్రాణంగా భావించే ఆనంద్ ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడు? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది అనేది మిగతా కథ.

ఒక ప్రేమ కథను నిజాయితీగా చెప్పాలని, దాని ద్వారా ఎమోషనల్ పండించాలని అనుకున్నాడు దర్శకుడు సాయిరాజేష్. బేబి సినిమాను కథను అంతే నిజాయితీగా చెప్పాడు. కామెడీ కి మంచి స్కోప్ ఉన్నా ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా తను చెప్పాలనుకున్న కథను హానెస్ట్ గా తెరకెక్కించాడు. దర్శకుడిగా నిర్మాతగా సెటైరిక్ కామెడీ ,స్పూఫ్ కామెడీ సినిమాలు తీసిన సాయి రాజేష్ తనలో కూడా విషయం ఉందని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. దర్శకుడిగా చాలా చోట్ల మెప్పించాడు. కొన్ని సన్నివేశాలను సాయి రాజేష్ తీసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ , ప్రీ క్లైమాక్ సీన్ హైలైట్ గా నిలిచాయి. వాటిలో సాయి రాజేష్ రైటింగ్ టాలెంట్ కనిపించింది.

బేబీ కోసం సాయి రాజేష్ కొత్త కథ తీసుకోలేదు. ఇప్పటికే కొన్ని లవ్ స్టోరీస్ లో చూసిందే మళ్ళీ చూసిన ఫీలింగ్ కలిగించాడు. దీంతో సినిమా చూస్తున్నంత సేపు మన్మథ ,ప్రేమిస్తే , ఆర్ ఎక్స్ 100 సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇందులో బోల్డ్ గా ఒక పాయింట్ టచ్ చేసి తన స్టైల్ లో ఫ్రెష్ గా చూపించే ప్రయత్నం చేసి అందులో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమాకు యాక్టర్స్, టెక్నిషియన్స్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ అందింది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ సినిమా చూస్తున్నంత సేపు ఒక మూడ్ లోకి తీసుకెళ్తుంది. సినిమా పూర్తయ్యాక విజయ్ మ్యూజిక్ గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సిందే.

బాల్ రెడ్డి కెమెరా వర్క్ కూడా సినిమాకు ప్లస్ అయింది. సినిమా నిడివి మాత్రం ఎక్కువైంది. మొదటి భాగం కాస్త స్లో గా నడుస్తూ ఇంటర్వెల్ వరకూ రన్ టైం గుర్తుచేస్తుంది. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ట్రిమ్ చేస్తే బాగుండేది. అలాగే పాత్రల ప్రవర్తన కాస్త మైనస్ అనిపించినా దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే ఓకే అనిపిస్తాయి. ఒకమ్మాయి ప్రేమ వల్ల మోసపోయాననుకునే ఆటో డ్రైవర్ ఆవేదన , ఆ అమ్మాయి తప్పు చేయాల్సిన పరిస్థితులను బాగా చూపించాడు దర్శకుడు. మొదటి భాగంలో కథ లేకపోయినా స్కూల్ లవ్ స్టోరీతో వచ్చే సీన్స్ , అక్కడక్కడా లైట్ కామెడీ తో బాగా నడిపించాడు.

ఇంటర్వెల్ బ్లాక్ నుండి అసలు కథలోకి తీసుకెళ్ళి అక్కడి నుండి ఎమోషనల్ డ్రామాతో మెప్పించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ బాగా డిజైన్ చేసుకున్నాడు. ఇలాంటి కథలు రాసుకునేటప్పుడు యూత్ ని దృష్టిలో పెట్టుకొని సీన్స్ రాసుకోవాలి. బేబీలో యూత్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ లో దర్శకుడు ఏది నిజమైన ప్రేమ అంటూ చూపించే ఎమోషనల్ సీన్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాకపోతే ఈ కథకి ఎలాంటి క్లైమాక్స్ రాసుకోవాలి అనే తర్జన భర్జనలో ప్రీ క్లైమాక్స్ నుంచి కన్ఫ్యూజన్ అయ్యాడు దర్శకుడు.

ఓవరాల్ గా బోల్డ్ పాయింట్ తో తెరకెక్కిన బేబి సినిమా, న్యూ ఈజ్ ఎమోషనల్ డ్రామాగా యూత్ ను ఆకట్టుకుంటుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links