anasuya
Home » Anasuya – నెటిజన్లకు అనసూయ స్పెషల్ రిక్వెస్ట్

Anasuya – నెటిజన్లకు అనసూయ స్పెషల్ రిక్వెస్ట్

by admin
0 comment

నటి అనసూయ మరోసారి ట్విట్టర్ లోకి వచ్చింది. నిత్యం ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా మారే ఈ అందగత్తె, ఈసారి మాత్రం ఓ ప్రత్యేక విన్నపంతో అందరిముందుకొచ్చింది. తనకు సంబంధం లేని అంశాలకు తన ఫొటోలు, డైలాగ్స్, మీమ్స్, సన్నివేశాలు వాడొద్దని రిక్వెస్ట్ చేస్తోంది అనసూయ.

కొన్ని రోజులుగా తనకు సంబంధం లేని ట్వీట్స్ కొన్ని చూస్తోంది అనసూయ. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్ చేసే క్రమంలో.. వాళ్లను కించపరిచేందుకు తన ఫొటోలు, డైలాగ్స్, మీమ్స్ ,సన్నివేశాలు వాడడాన్ని అనసూయ తప్పుపడుతోంది. అది సదరు సినీ-రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాకుండా.. తనకు కూడా అవమానమని అంటోంది.

ఎంతో జాగ్రత్తగా తన జీవితాన్ని, కెరీర్ ను మలుచుకొని, ఓ పరిపూర్ణ మహిళగా ఎదిగానని, తనను కించపరిచేలా వ్యవహరించొద్దని నెటిజన్లను కోరింది అనసూయ. తనకు పీఆర్ మేనేజర్లు లేరని, అన్నీ తనే స్వయంగా చూసుకుంటానని, ఇలాంటి వ్యాఖ్యలు తనను బాధిస్తాయని అంటోంది.

రీసెంట్ గా విజయ్ దేవరకొండతో వివాదంతో తెరపైకొచ్చింది అనసూయ. సోషల్ మీడియాలో సూటిగా ఉండే ఈమె, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను సమర్థంగా ఎదుర్కొంది. తనపై వచ్చిన చాలా ట్రోల్స్ ను తిప్పికొట్టింది. అదే టైమ్ లో భర్తతో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లింది. ఆ టైమ్ లోనే ఆమె కాస్త సేదతీరింది.

ఇక విజయ్ దేవరకొండతో వివాదాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. ఇండియా వచ్చిన వెంటనే, ఆ వివాదానికి పుల్ స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు తన మీమ్స్, ఫొటోలు వాడొద్దంటూ నెటిజన్లను కోరింది. చూస్తుంటే.. అనసూయ ఇకపై వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

తనకు మనశ్శాంతి కావాలని, అందుకే ఇకపై కొన్ని అంశాల జోలికి వెళ్లనని, ఆమె తాజాగా ప్రకటించింది. ఆ దిశగానే ఆమె సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links