Home » Allu Aravind – పరశురామ్ పై పరోక్షంగా సెటైర్లు

Allu Aravind – పరశురామ్ పై పరోక్షంగా సెటైర్లు

by admin
0 comment

ఉన్నట్టుండి సడెన్ గా వార్తల్లోకెక్కారు అల్లు అరవింద్. ఓ సినిమా ఫంక్షన్ కోసం వచ్చిన ఆయన, పరోక్షంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా బన్నీ వాస్ నుంచి 2018 అనే సినిమా వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది ఆ సినిమా. ఆ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా అల్లు అరవింద్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి సక్సెస్ మీట్ ఏర్పాటుచేశాడు బన్నీ వాస్. స్టేజ్ పైకి వస్తూనే, ఓవైపు బన్నీ వాస్ తో, మరోవైపు చందు మొండేటితో ఫొటోదిగారు అల్లు అరవింద్. త్వరలోనే తాము ముగ్గురం కలిసి సినిమా చేయబోతున్నామని ప్రకటించారు.

ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే సంచలన కామెంట్స్ చేశారు అల్లు అరవింద్. కార్తికేయ-2 తర్వాత చందు మొండేటికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ కార్తికేయ-2 కంటే ముందే అల్లు అరవింద్ కు ఆయన కమిట్ మెంట్ ఇచ్చి ఉన్నారు. అందుకే కార్తికేయ-2 తర్వాత భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ, అల్లు అరవింద్ కు, గీతాఆర్ట్స్-2కే ఆయన ఫిక్స్ అయిపోయారు.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన అల్లు అరవింద్. ఈమధ్య అలా కమిట్ మెంట్స్ మరిచిపోయి గీత దాటి వెళ్లినవాళ్లు కూడా కొందరున్నారని, చందు మొండేటి అలా చేయలేదని అన్నారు. అలా పరోక్షంగా పరశురామ్ పై ఆయన కామెంట్స్ చేసినట్టయింది. గీతా కాంపౌండ్ లో ఉన్న పరశురామ్, ఓ భారీ ఆఫర్ రావడంతో.. ఆ కాంపౌండ్ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. దాన్నే అల్లు అరవింద్ పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు చాలామంది.

ఈ సందర్భంగా యంగ్ టాలెంట్ గురించి మాట్లాడుతూ.. యంగ్ టాలెంట్ కు స్పేస్ ఇవ్వాలని.. తను, దిల్ రాజు లాంటి వాళ్లు మొత్తం స్పేస్ ఆక్రమించేసి, పేరు-డబ్బు తమకు మాత్రమే రావాలని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. అందుకే తను యంగ్ టాలెంట్ కు స్పేస్ ఇస్తానని అన్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links