women
Home » మణిపుర్‌ ఘటన తరహాలో బెంగాల్‌లో దారుణం

మణిపుర్‌ ఘటన తరహాలో బెంగాల్‌లో దారుణం

by admin
0 comment

దేశాన్ని కుదిపేసిన మణిపుర్‌ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే బెంగాల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ అమానుష ఘటన మాల్దా జిల్లాలోని పకుహత్ ప్రాంతంలో జరిగింది. దొంగతనం చేశారని నెపంతో ఓ గుంపు.. బాధిత మహిళల చీరలు చించి, చెప్పులతో దాడి చేస్తున్న దుశ్చర్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల్లో చాలా మంది మహిళలే ఉండటం గమనార్హం.

కాగా, పశ్చిమ బెంగాల్ బీజీపీ చీఫ్ సుకాంత మజుందార్ ట్విటర్‌లో ఈ అమానుష ఘటన వీడియోను షేర్ చేశారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. వీడియో చూసిన తర్వాతే తమకు ఘటన గురించి తెలిసిందని అన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో దాడి చేశారని తెలిపారు. అయితే బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links