miller
Home » మిల్లర్‌ సెంచరీ.. ఆసీస్‌ లక్ష్యం 213

మిల్లర్‌ సెంచరీ.. ఆసీస్‌ లక్ష్యం 213

by admin
0 comment

డేవిడ్ మిల్లర్ (101) వీరోచిత శతకం బాదడంతో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ జట్టుకు పేలవ ఆరంభం లభించింది. ఆసీస్‌ పేసర్ల ధాటికి బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన మిల్లర్ తో కలిసి క్లాసెన్‌ (47) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే గేర్‌ మార్చి దూకుడు పెంచిన క్లాసెన్‌ ను హెడ్‌ బోల్తాకొట్టించాడు. ఆ తర్వాతి బంతికే జేన్సన్‌ కూడా ఔట్ చేయడంతో సఫారీ జట్టు 119 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

అనంతరం కొయెట్జి (19) సాయంతో మిల్లర్‌ పోరాటం కొనసాగించాడు. వికెట్‌ను కాపాడుకుంటూనే బౌండరీలను బాదాడు. మరోఎండ్‌లో వికెట్‌ పడుతుండటంతో మరింత దూకుడుగా ఆడాడు. 115 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. అయితే తర్వాతి బంతికే మిల్లర్‌ వెనుదిరిగాడు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌ చెరో మూడు వికెట్లు, హేజిల్‌ వుడ్‌ , హెడ్‌ తలో రెండు వికెట్లు తీశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links