marriage mlc
Home » YCP ఎమ్మెల్సీ మూడో పెళ్లి – రెండో భార్య సాక్షి సంతకం

YCP ఎమ్మెల్సీ మూడో పెళ్లి – రెండో భార్య సాక్షి సంతకం

by admin
0 comment

వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం నిరాడంబరంగా జరిగింది. కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుజాతను వివాహం చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఈ పెళ్లికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రెండో భార్య సునీత.. సాక్షి సంతకం చేయడం విశేషం. భార్య, కుమారుడు సమక్షంలోనే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ. అనంతరం దంపతులకు కైకలూరు సబ్‌రిజిస్ట్రార్‌ మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ను అందజేశారు. కాగా, ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. ఆ తరువాత రెండో భార్య సునీతను వివాహం చేసుకోగా ఆమెకి ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు. మరోవైపు సుజాతకు కూడా గతంలో పెళ్లి జరిగింది, ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు.

జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links