వాల్నట్లను (walnuts) పగులగొట్టడం అంత ఈజీ కాదు. కానీ మార్షల్ ఆర్టిస్ట్ నవీన్ కుమార్ తలతో పగులగొట్టారు. నిమిషంలో ఏకంగా 273 వాల్నట్లను పిప్పిచేసి ప్రపంచ రికార్డు సాధించి గిన్నిస్ రికార్డు (Guinness World Record) నెలకొల్పారు. సెకనుకు సుమారుగా 4.5 వాల్నట్లను బద్దలుకొట్టారు. ఈ క్రమంలో గతంలో పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ రషీద్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. రషీద్ నిమిషంలో 254 వాల్నట్లను పగులగొట్టారు.
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో ఉండే తీవ్ర పోటీనే నవీన్-రషీద్ మధ్య జరిగింది. రషీద్ తొలిసారిగా 2014లో 150 వాల్నట్లను పగులగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2016లో 181 పగులగొట్టి తన పేరుపైనే రికార్డును తిరగరాశారు. అయితే 2017లో బరిలోకి దిగిన 27 ఏళ్ల నవీన్ కుమార్ 217 వాల్నట్లను బద్దలుకొట్టి రషీద్‌ను అధిగమించి రికార్డు సాధించారు. అయితే ఆ తర్వాత ఏడాది ఇద్దరి మధ్య సాగిన పోటీలో రషీద్పైచేయి సాధించారు. నవీన్ 239 వాలనట్లను పిప్పి చేయగా రషీద్ 254 వాల్నట్లను పగులగొట్టారు. ఈ సారి కసితో బరిలోకి దిగిన నవీన్ కుమార్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు.