documents
Home » Study Abroad: ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

Study Abroad: ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

by admin
0 comment

అమెరికాకు వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్‌ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. అమెరికా దగ్గరలో ఉంటే మళ్లీ వెళ్లొచ్చులే అని లైట్‌ తీసుకోగలం. కానీ విదేశీ చదువులు అంటే ఎన్నో ఆశలు, పేరెంట్స్‌ కలలు, రూ.లక్షల ఖర్చు. అంతేకాదు ఒకసారి అమెరికా వెనక్కి పంపిస్తే 5 ఏళ్ల వరకు మళ్లీ వెళ్లే అవకాశమే ఉండదు. అందుకే విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా సిద్ధం అవ్వాలి. అసలు విదేశీ చదువుల కోసం వెళ్లే స్టూడెంట్స్‌ ఏం తీసుకోనివెళ్లాలో చూద్దాం.

  • ఎంపికైన యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‌, దానితో పాటు కోర్సు రిజిస్ట్రేషన్‌ను తీసుకోని వెళ్లాలి.
  • ఫైనాన్సిషయల్‌ ప్రూఫ్స్‌ (వీసాకు అప్లై చేసే సమయంలో ఇచ్చే వివరాలు)
  • ఎడ్యూకేషనల్‌ సర్టిఫికేట్స్‌ (ట్రాన్సక్రిప్ట్స్‌)
  • టెస్ట్‌ స్కోరు (జీఆర్‌ఈ, ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్‌)
  • రెజ్యూమె
  • స్టేట్‌మెంట్‌ ఆప్‌ పర్పస్‌
  • రికమెండేషన్‌ లెటర్స్‌
  • పని అనుభవ ధ్రువపత్రం (ఏదైనా ఉంటే)

వీటితో పాటు అక్కడికి వెళ్లిన తర్వాత.. ఎక్కడ స్టే చేస్తారు? ఎందుకు ఈ కోర్సు తీసుకున్నారు? అనే ప్రశ్నలు వేసే అధికారులు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్‌ అయిన తరహాలోనే సన్నద్ధమవ్వడం మంచిది. అంతేగాక ఫైనల్‌ ఇయర్‌లో చేసిన ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ కూడా తీసుకోని వెళ్లాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links