నెలలో 38 లక్షల పెళ్లిళ్లు.. రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం

రేపటి నుంచి డిసెంబర్‌ 15 వరకు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరగనున్నాయి. సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నాయని, వాటి కోసం దాదాపు 4.74 లక్షల కోట్ల రూపాయిల వ్యాపారం జరగనుందని వ్యాపారుల సమాఖ్య ‘కాయిట్‌’ అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ప్రజలు ఈసారి ఖర్చు చేయబోతున్నారని కాయిట్ పేర్కొంది. గత ఏడాది 32 లక్షల పెళ్లిళ్లు జరగ్గా, సుమారు రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. నవంబరులో 23, 24, 27, 28, 29, డిసెంబరులో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో పెళ్లి ముహుర్తాలు అధికంగా ఉన్నాయి. ఇక ఒక్క దిల్లీలోనే 4 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని, సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడి నుంచే నమోదవుతుందని వెల్లడించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం