virat
Home » సచిన్‌ను అధిగమించి.. సంగక్కరను సమం చేసిన కోహ్లి

సచిన్‌ను అధిగమించి.. సంగక్కరను సమం చేసిన కోహ్లి

by admin
0 comment

వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్‌ విరాట్ కోహ్లి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై నిస్సాంక చేతికి చిక్కాడు. అయితే మరోసారి సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రికార్డులు మాత్రం బద్దలుకొట్టాడు. వన్డే చరిత్రలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సార్లు 1000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్‌ టెండుల్కర్ పేరిట ఉండేది. సచిన్‌ ఈ ఘనతను ఏడు సార్లు సాధిస్తే.. కోహ్లి ఎనిమిది సార్లు సాధించాడు.
సచిన్‌ – (1994, 1996-98, 2000, 2003, 2007)
విరాట్ – (2011-14, 2017-19, 2023)

విరాట్ కోహ్లి మరో రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా కుమార సంగక్కరతో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధికంగా సచిన్‌ 145 సార్లు అర్ధశతకాలు అందుకున్నాడు. కోహ్లి, సంగక్కర 118 సార్లు హాఫ్‌ సెంచరీ చేశారు. వాళ్ల తర్వాత స్థానంలో రికీ పాంటింగ్‌ (112 సార్లు) ఉన్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links