టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సమవుజ్జీ, సమర్థమైన ప్రత్యర్థిగా భావించిన దక్షిణాఫ్రికాను కనికరం లేకుండా భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. 243 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్‌ను రోహిత్‌సేన సుస్థిరం చేసుకుంది. సెంచరీతో కింగ్ కోహ్లి, అయిదు వికెట్లతో జడేజా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ”ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై బ్యాటింగ్ అంత ఈజీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడాలంటే మీ అందరికీ కోహ్లి లాంటి ప్లేయర్ ఒకరు కావాల్సిందే” అని విరాట్ ఇన్నింగ్స్‌ను హిట్‌మ్యాన్ కొనియాడాడు. తన 35వ బర్త్‌డే రోజు కోహ్లి 49వ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ శతకంతో వన్డే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్‌తో సమంగా నిలిచాడు.
226
previous post