jadeja
Home » Ravindra Jadeja – Virat Kohli జడేజాకు సారీ చెప్పిన కోహ్లి.. కారణమేంటి?

Ravindra Jadeja – Virat Kohli జడేజాకు సారీ చెప్పిన కోహ్లి.. కారణమేంటి?

by admin
0 comment

కింగ్‌ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై శతకం సాధించాడు. వన్డే కెరీర్‌లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లి.. జడేజాకు సారీ చెప్పాడు. ఎందుకంటే జడేజా 10 ఓవర్లు వేసి 38 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో పాటు గాల్లోకి దూకుతూ ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌ తర్వాత జడ్డూకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు వస్తుందని భావించారంతా. కానీ సెంచరీతో అలరించి కోహ్లి అవార్డు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా.. ‘జడ్డూ నుంచి అవార్డు దొంగలించినందకు సారీ’ అని కోహ్లి ఫన్నీగా చెప్పాడు. అయితే ప్రతిమ్యాచ్‌లో ఓ ప్లేయర్‌కు ‘బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌’ ఇస్తున్న టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ దిలిప్‌ ఈ మ్యాచ్‌లో జడేజాకు ఇచ్చాడు. గత ప్రపంచకప్‌ నుంచి ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన జడేజా 5.22 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు. ఈ వరల్డ్‌ కప్‌లో నాలుగు మ్యాచుల్లోనే ఏడు వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి మరిన్ని రికార్డులు సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ ప్రపంచకప్‌ల్లో వెయ్యిపరుగులు సాధించిన భారత తొలి ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అలాగే వేగంగా 26 వేల పరుగుల మైలురాయి చేరుకున్న ఆటగాడిగా సచిన్‌ రికార్డును విరాట్‌ బద్దలు కొట్టాడు. 567 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లి ఈ ఘనత చేరుకోగా.. సచిన్‌కు 601 ఇన్నింగ్స్‌లు పట్టాయి. కోహ్లి ప్రస్తుత అంతర్జాతీయ పరుగులు 26,026. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో కోహ్లి నాలుగో స్థానానికి ఎగబాకాడు. సచిన్‌ (34,357), సంగక్కర (28,016), పాంటింగ్‌ (27,483) తొలి మూడు స్థానాల్లో ఉండగా జయవర్ధనె (25,957) అయిదో స్థానంలో ఉన్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links