310
రాఖీ వేడుకను జరుపుకునేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 8 కి.మీ నడిచి వెళ్లింది. మిట్టమధ్యాహ్నం ఎండలో నడిచివెళ్లి తమ్ముడుకు రక్షను కట్టి అక్క ప్రేమను చాటింది. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలో కొత్తపల్లిలో బామ్మ బక్కవ్వ, కరీంనగర్ జిల్లాలోని కొండాయపల్లిలో తన తమ్ముడు మల్లేశం నివాసం ఉంటున్నారు. అయితే రెండు గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేదు. దీంతో రాఖీ కట్టేందుకు తమ్ముడి ఇంటికి కాలినడకనే పయనమైంది. దారిలో ఓ యువకుడు ఎటు వెళ్తున్నావంటూ వీడియో తీస్తూ బక్కవ్వను పలకరించగా అసలు విషయం చెప్పింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.