తమిళ సీనియర్ నటి విచిత్ర ఓ పెద్ద తెలుగు హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. సుమారు 22 ఏళ్ల క్రితం తాను ఓ సినిమాలో నటించాని, ఆ టైమ్‌లో ఆ తెలుగు స్టార్ హీరో లైంగికంగా వేధించినట్లు చెప్పింది. “కనీసం నా పేరు కూడా తెలుసునే ప్రయత్నం చేయలేదు ఆ హీరో. వెంటనే గదిలోకి రమ్మని పిలవడంతో షాక్ అయ్యా. అక్కడ్నుంచి మెల్లగా జారుకొని నా రూమ్ కు చేరుకున్నా. కానీ మరుసటి రోజు నుంచి సెట్స్ లో వేధింపులు మొదలయ్యాయి. షాట్స్ ఓకే అవ్వలేదు. అసభ్యంగా మాట్లాడేవారు. ఈ విషయంపై యూనియన్ ను సంప్రదించినా ఫలితం దక్కలేదు” అని విచిత్ర వాపోయింది. విచిత్ర తమిళంలో పాటు సహాయ నటిగా తెలుగు, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఇటీవల తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొంది. బిగ్ బాస్ హౌజ్ లోనే ఈ సంచలన విషయాలు బయటపెట్టింది.
337
previous post