rape
Home » KERALA: మద్యం తాగించి.. అమెరికా మహిళపై గ్యాంగ్‌ రేప్‌

KERALA: మద్యం తాగించి.. అమెరికా మహిళపై గ్యాంగ్‌ రేప్‌

by admin
0 comment

అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కేరళలోని కొల్లంలో చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కొల్లంలోని ఓ ఆశ్రమానికి 44 ఏళ్ల అమెరికా మహిళ జులై 22న వచ్చారు. గత సోమవారం ఆమె ఒంటరిగా సమీపంలోని బీచ్‌లో సేద తీరుతున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు సిగరెట్‌ను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆమె దానిని తిరస్కరించడంతో మద్యాన్ని తీసుకోవాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆమె దాన్ని తీసుకున్నాక మత్తులోకి జారుకున్నారు. ఇదే అదనుగా ఆ వ్యక్తులు ఆమెను బైక్‌పై తీసుకెళ్లి సమీపంలోని ఖాళీ ఇంటిలో పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ సంఘటనపై బాధిత మహిళ మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links