tsrtc
Home » TSRTC: రాఖీ స్పెషల్‌.. రూ.5.50 లక్షల బహుమతులు

TSRTC: రాఖీ స్పెషల్‌.. రూ.5.50 లక్షల బహుమతులు

by admin
0 comment

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులు ఇవ్వనుంది.

ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి, వాటిని బస్టాండ్స్‌లో ఏర్పాటు చేసిన  డ్రాప్ బాక్స్‌ల్లో వేయాలి. సెప్టెంబర్‌ 9వ తేదీలోగా ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీఎస్‌ఆర్టీసీ సూచించింది.

కాగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 రాయితీ టికెట్లను టీఎస్‌ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెప్టెంబరు 2వ తేదీ నుంచి టీ-9 టికెట్ల విక్రయాలు యథాతథంగా కొనసాగుతాయని వివరించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links