renu
Home » అందుకే వరుణ్‌తేజ్‌ పెళ్లికి వెళ్లట్లేదు: రేణూ దేశాయ్‌

అందుకే వరుణ్‌తేజ్‌ పెళ్లికి వెళ్లట్లేదు: రేణూ దేశాయ్‌

by admin
0 comment

వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు ఇటలీలో ఘనంగా వివాహం జరగనుంది. అయితే వరుణ్‌ తేజ్‌ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడంలేదనే విషయాన్ని నటి రేణూ దేశాయ్‌ తెలిపారు. వరుణ్ తేజ్‌ తన ముందే పెరిగాడని, తన ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు. నిహారిక పెళ్లికి కూడా తాను వెళ్లలేదని, పిల్లల్ని మాత్రం పంపించానని చెప్పారు. ఇప్పుడు వరుణ్‌ పెళ్లికి వెళ్తే అసౌకర్యంగా ఫీలవుతారని, అందుకే వెళ్లట్లేదని రేణూ దేశాయ్‌ వివరించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో కొన్ని రోజుల క్రితం చెప్పిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరోవైపు వరుణ్‌-లావణ్య పెళ్లి వేడుకలో భాగంగా కాక్‌టేల్‌ పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఇందులో లావణ్య వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది. హల్దీ, మెహందీ ఇవాళ నిర్వహించనున్నారు. నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు ఈ ప్రేమజంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links