విరాట్ కోహ్లి, నవీనుల్ హక్ మధ్య వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. దిల్లీ వన్డేలో నవీనుల్‌ను తన అభిమానులు టీజ్ చేస్తుంటే కోహ్లి అడ్డుకున్నాడు. అలా చేయొద్దంటూ సంజ్ఞలు చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ షేక్ హ్యాండ్ చేసుకొని సరదాగా మాట్లాడుకున్నారు.
అయితే దీనిపై గంభీర్ స్పందించాడు. ‘మైదానంలో పోరాడాలి, అవతల కాదు. ప్రతి ప్లేయర్ జట్టు కోసమే పోరాడుతుంటాడు. ఏ దేశమని, ఎంత అద్భుత ప్లేయర్ అనేది అనవసరం. కోహ్లీ, నవీనుల్ హక్‌ను ఇలా చూడటం చాలా బాగుంది. ఎట్టకేలకు ఐపీఎల్ ఫైట్‌కు శుభం కార్డు పడింది. అయితే క్రికెట్ లవర్స్‌కు ఓ రిక్వెస్ట్ చేస్తున్నా. స్టేడియంలో కానీ, నెట్టింట్లో కానీ.. ఏ ప్లేయర్‌ను సరదాగా కూడా ట్రోలింగ్ చేయకండి’ అని గంభీర్ అన్నాడు. ఐపీఎల్‌లో కోహ్లికి నవీనుల్, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ ముగ్గురు మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది.