INDvsPAK- రోహిత్‌ రికార్డుల పరంపర.. నెక్స్ట్ టార్గెట్ పాక్‌

దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 273 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 35 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులు బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లుగా బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. గేల్‌ 553 సిక్సర్ల సాధించగా హిట్‌మ్యాన్‌ దాన్ని అధిగమించాడు. రోహిత్ మరో రికార్డు సాధించాడు. భారత్ తరఫున వన్డే వరల్డ్‌కప్‌లో 1000 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో సచిన్‌, కోహ్లి ఉన్నారు. ఇక మెగా సమరంలో 1000 పరుగులు రికార్డును తక్కువ ఇన్నింగ్స్‌లో సాధించిన ఆటగాడిగా డేవిడ్‌ వార్నర్‌తో తొలి స్థానాన్ని పంచుకున్నాడు.

మరోవైపు టీమిండియా తర్వాత మ్యాచ్‌పై గురిపెట్టింది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు అజేయ రికార్డు ఉంది. ఇప్పటివరకు వన్డే సమరంలో 7 మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ సారి కూడా పాక్‌ను చిత్తుచేసి 8-0తో రికార్డును మరింత పదిలం చేసుకోవాలని రోహిత్ సేన కసిగా ఉంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం