records
Home » వరల్డ్‌కప్‌ కాదు.. సెంచరీల కప్‌ అనాలి!

వరల్డ్‌కప్‌ కాదు.. సెంచరీల కప్‌ అనాలి!

by admin
0 comment

ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బౌండరీలు, సిక్సర్లతో హొరెత్తిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగితే ఏకంగా 12 శతకాలు నమోదు కావడం విశేషం. ఈ మెగాటోర్నీలో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లతో పాటు రెండు సెమీ ఫైనల్స్‌, ఒక ఫైనల్‌ జరగనున్నాయి. అప్పటివరకు మరిన్ని సెంచరీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కప్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ప్లేయర్‌ డికాక్‌ రెండు సెంచరీలు, ఇంగ్లాండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలన్‌, పాక్‌ ప్లేయర్‌ మహ్మద్ రిజ్వాన్‌, ఇండియా ఓపెనర్‌ రోహిత్ శర్మ, కివీస్ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర, శ్రీలంక ప్లేయర్‌ కుశాల్ మెండిస్‌, పాక్ ఆటగాడు అబ్దుల్లా షఫికీ, లంక బ్యాట్స్‌మన్‌ సమరవిక్రమ, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డసెన్‌, మరక్రమ్‌ తలో ఒక సెంచరీ చేశారు. ఇక భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (97*), విరాట్ కోహ్లి (85) శతకానికి చేరువయ్యారు. అయితే టోర్నీ ఆద్యంతం పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండబోవని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. తర్వాత స్లో పిచ్‌లుగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరోవైపు ఈ ప్రపంచకప్‌లో పాత రికార్డులన్ని బద్దలయ్యాయి. శ్రీలంకపై పాకిస్థాన్‌ 345 పరుగలు లక్ష్యాన్ని ఛేదించి అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నెలకొల్పింది. అదే శ్రీలంక జట్టుపై దక్షిణాఫ్రికా మెగాటోర్నీలో అత్యధిక స్కోరును సాధించింది. 5 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది. అదే మ్యాచ్‌లో సఫారీ ప్లేయర్‌ వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందదుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ ప్రపంచ సిక్సర్ల వీరుడిగా, వరల్డ్‌ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links