Siddipet: దారుణం.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి చెందిన వెంకటమ్మ (45) పాత ఇనుప సామాగ్రి క్రయవిక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త పదిహేనేళ్ల క్రితం మృతిచెందారు. కుమారై శైలజకు వివాహం అయింది. ప్రమాదంలో ఓ చేయి కోల్పోయిన కుమారుడు ఈశ్వర్‌తో కలిసి ఉంటుంది.

అయితే ఒక చేయి లేకపోవడంతో ఈశ్వర్‌కు పెళ్లి కావడంలేదు. ఈ విషయంలో ఇద్దరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారిన ఈశ్వర్‌ తన బంధువు రాము సాయంతో తల్లిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. వారిద్దరూ కలిసి ఆమె గొంతును కోశారు. అనంతరం కేసు వారిపై రాకూడదని దొంగలు హత్య చేసినట్లుగా ప్రణాళిక రచించారు. తల్లి కాళ్లను కిరాతకంగా కోసి కడియాల కోసం దొంగలు హత్య చేసినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సోదరి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్‌ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు విచారణ జరపగా ఈ దారుణం బయటపడింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..