బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక కాంబోలో వస్తున్న సినిమా ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్.. సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 21 నిమిషాలు. ఇంత పెద్ద రన్ టైమ్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కూడా 3 గంటల 6 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించలేదు. ఇప్పుడు యానిమల్ ట్రైలర్ చూశాక.. సందీప్ రెడ్డి మరోసారి ఆ సక్సెస్‌ను అందుకునేలా కనిపిస్తున్నాడు.
238
previous post