guntur
Home » షాకింగ్- గుంటూరు కారం సాంగ్ లీక్

షాకింగ్- గుంటూరు కారం సాంగ్ లీక్

by admin
0 comment

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ నుంచి చిన్న బిట్ ఆడియో లీక్ అయ్యింది. ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగే ఆ క్లిప్ క్యాచీగా ఉంది. దీనికి సంబంధించిన ఆడియో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. వెంటనే స్పందించిన మేకర్స్ దాన్ని సోషల్ మీడియా నుంచి తొలగించారు. అంతేగాక ఇప్పుడు ఆ సాంగ్‌ రిలీజ్‌పై ప్రొడ్యూసర్‌ నాగవంశీ ఇండైరక్ట్‌గా అప్‌డేట్‌ ఇచ్చాడు. మంగళవారం రిలీజ్‌ కానుందని బ్లాస్టింగ్ సింబల్స్‌తో ట్వీట్‌ చేశాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links