శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ‘మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా విడిపోతున్నారా అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ట్వీట్ వెనుక బాధకరమైన ఉద్దేశం ఏంటనే దానిపై క్లారిటీ లేదు. శిల్పా శెట్టితో విడిపోతున్నట్లు గానీ, గొడవపడినట్లు గానీ అతడు చెప్పలేదు. అయితే రాజ్‌కుంద్రా కొన్ని నెలలుగా ముఖానికి మాస్క్ వేసుకుని బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. నీలిచిత్రాల కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన దగ్గర నుంచి కుంద్రా అలాగే తిరుగుతున్నా డు. ఈ నేపథ్యంలో కుంద్రా విడిపోయేది మాస్క్ తోనా? ఆ కారణంగానే అలా ట్వీట్ చేసాడా? లేక శిల్పాశెట్టిని ఉద్దేశించి చేశాడా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్‌కుంద్రా ‘యూటీ 69’తో తెరంగేట్రం చేయనున్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పడిన మానసిక సంఘర్షణలను ఇందులో చూపనున్నారు.