RBI – రూ.1000 నోట్లు మళ్లీ వస్తున్నాయా?

రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు గతకొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం RBIకి వెయ్యి నోట్లు తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనే లేదని తెలుస్తోంది. రీ ఇంట్రడక్షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అసలు ఆ విషయాన్ని పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్లను RBI ఉపసంహరించుకుంది ఇకపై ఈ నోట్లు చెలామణిలో ఉండవని స్పష్టం చేసింది. ఇక 2016లో మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే రూ.500తో పాటు రూ.1000 నోట్లూ రద్దైపోయాయి. రూ.1000 నోట్ల స్థానంలో రూ.2 వేల నోట్లు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొత్తగా రూ.500 నోట్లు ప్రవేశపెట్టింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం