363
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా వార్తల్లో మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఆరోగ్యంపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా ఓ మ్యాగ్‌జైన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది సమంత. దానికి సంబంధించిన ఫొటోలో ఇన్‌స్టాలో పంచుకుంది. అందులో సమంత అందాలను ఆరబోసింది. బ్లాక్ కలర్ బికినితో పాటు బ్యాక్ మొత్తం కనిపించేలా పోజులిచ్చింది సమంత. అయితే ఇలా బ్యాక్ చూపిస్తూ డిజైన్ చేసిన డ్రెస్ ధర ఏకంగా 5 లక్ష 50వేల రూపాయిలంట. లూయీస్ వూటాన్ కు చెందిన డిజైనర్ వేర్ ఇది. వెనక వైపు మాత్రమే కాదు, ముందు భాగంలో కూడా ఓ మోస్తరుగా గ్లామర్ ఒలకబోసేందుకు వీలుగా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ప్రస్తుతం సమంత ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.