rapido
Home » పోలింగ్‌: ర్యాపిడో ‘ఫ్రీ’ రైడ్‌- కోడ్‌ ఏంటంటే?

పోలింగ్‌: ర్యాపిడో ‘ఫ్రీ’ రైడ్‌- కోడ్‌ ఏంటంటే?

by admin
0 comment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30న జరగనున్నాయి. అయితే ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ర్యాపిడో.. పోలింగ్‌ రోజు ఓటర్ల కోసం ఫ్రీ రైడ్‌ ఇస్తుంది. హైదరాబాద్‌లోని 2600 పోలింగ్‌ బూత్‌లకు ఉచిత రైడ్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ర్యాపిడో కెప్టెన్లంతా ఆ రోజు ఉదయం నుంచే సిద్ధంగా ఉంటారని తెలిపింది. రవాణా గురించి చింతించకుండా ప్రజలు సౌకర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం, హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం పెరగాలన్న లక్ష్యమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ర్యాపిడో కో-ఫౌండర్‌ పవన్‌ గుంటుపల్లి తెలిపారు. మరి, ఈ ఫ్రీ రైడ్‌ ఎలా పొందాలంటే.. పోలింగ్‌ జరిగే 30న ర్యాపిడో యాప్‌లో ఫ్రీ రైడ్‌ డిటయిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందో టైప్‌ చేయాలి. అప్లై కూపన్‌ కోడ్‌ ఉన్న చోట ‘వోట్‌ నౌ’ అనే వన్‌ టైమ్‌ కోడ్‌ను ఎంటర్‌ చేస్తే ఫ్రీ రైడ్‌ బుక్‌ అవుతుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links