నా రెండో పెళ్లి గురించి మీరెలా రాస్తారు? – ప్రగతి

తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటి ప్రగతి ఖండించారు. ఓ ప్రముఖ నిర్మాతను ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ఇటీవల పలు మీడియాల్లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ప్రగతి మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే తానే చెబుతానని చెప్పారు. నటిని కాబట్టి తన మీద ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు అని, తన వ్యక్తిగత జీవితంపై ఇష్టమెచ్చినట్లు వార్తలు రాసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. హద్దులు మీరకుండా, నిజనిజాలు తెలుసుకొని రాయాలని అన్నారు. ప్రస్తుతం ప్రగతి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో సహాయనటి పాత్రల్లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోస్ట్‌లు పెడుతుంటారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం